My village
మా గ్రామం చాలా అందమైనది . ఎలా అంటే మా గ్రామం లోకి వెళ్ళే ముందు పచ్చని ప్రకృతి అందాలు ఎవ్వరినైన ఆకట్టుకుంటాయి ఆ ప్రకృతిలో కనిపించే అందమైన శిఖరాలు చూసేందుకు చాలా కనువిందుగా ఉంటాయి .
ఆ ఫోటో మా ఊరికి వెళ్ళే ముందు పచ్చని ప్రకృతితో,అందమైన పర్వతాలతో, అందాలను విరజిమ్ముతూ అందరినీ ఆహ్వానిస్తుంది
మా గ్రామం వెళ్ళే దారిలో పైన ఉన్న ఫోటో, మా ఊర్లోని పశుపోషకులు వాటిని మేపుతు తమదైన రీతిలో కనివిడి చేస్తారు. తమదైన జానపద గీతాలతో, వినసొంపుగా తాము చేసే పని నుండి అలసటను , కష్టాన్ని మర్చిపోతూ పాడుతుంటారు . చిన్నప్పుడు నేను ప్రకృతి ఒడిలో ఆడుకున్నాను .మా తాతయ్య ,మా నానమ్మ దగ్గర నేను చాలా మెళుకువలు నేర్చుకున్నాను.
మా గ్రామం లో సూర్యుడు ఉదయించే సమయం చాలా అద్భుతంగా ఉంటుంది పై చిత్రం చూస్తే అర్థమవుతుంది. కోడి కూత తో, పక్షుల అరుపులతో, పెంపుడు జంతువుల కవ్వింపులతో మా గ్రామం నిద్రలోలోంచి మెలుకుంటధి . అందరూ తమ తమ కార్య నిర్వహణకు బయలు దెరతరు.
మా గ్రామం లో కొందరు ఉప్పరి పని అనగా! గృహనిర్మాణం తమ జీవనాధారం.
పక్క గ్రామాలకు వెళ్లి పనులు చేస్తుంటారు, తమధఅయిన రితిలో అందర్నీ ఆకట్టుకునే విధంగా నిర్మాణాలు చేస్తుంటారు.
మా గ్రామం లోని కొన్ని అడవి ప్రాంతాలు చూడడానికి చాలా బాగుంటాయి అలాగే చాలా రకాల జంతువులకు అవాసాలను కల్పిస్తాయి మా గ్రామం అడవిలో ప్రధానంగా ఉండే జంతువులు జింకలు,పందులు,కుందేళ్ళు,తోడేళ్ళు,నక్కలు.
ఆరుదుగా కనిపిస్తూ ఉండే జంతువులు .పక్షులు చూస్తే నెమళ్ళు
ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంటాయి .మా గ్రామ ప్రజలు అప్పుడప్పుడు పై జంతువులను వేటాడుతు ఆహారాన్ని సంపదిస్తుంటారు .
మా గ్రామం లోని సూర్యాస్తమయ సమయాల్లో కనిపించే వాతావరణం చాలా అందంగా ఉంటుంది పై పిక్చర్ చాలా అందంగా ఉంది కదూ .
Comments
Post a Comment